వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లష్కరే తో వికారుద్దీన్ కు లింక్?

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ముంబై పేలుళ్ల నేపథ్యంలో విచారణ నిమిత్తం వికారుద్దీన్ కౌంటర్ ఇంటలిజన్స్ పోలీసులు తీసుకుని వస్తుండగా కాల్పుల సంఘటన జరిగినట్లు హైదరాబాదు నగర పోలీసు కమీషనర్ ప్రసాదరావు చెప్పారు. వికారుద్దీన్ అనుచరుడు నాటు తుపాకితో పోలీసులపైకి కాల్పులు జరిపినట్లు ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. వికారుద్దీన్ అలియాస్ అలీమాన్ ఏడాది పాటుగా కనిపించడం లేదని ఆయన చెప్పారు. కాల్పులు జరిపి వికారుద్దీన్ తో పాటు అతని అనుచరులు ఇద్దరు పారిపోయినట్లు ఆయన తెలిపారు. పోలీసు కమీషనర్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు.

వికారుద్దీన్ గతంలో డిజెఎస్ కార్యకర్తగా పని చేసినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం సిమితో పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. గత కొంత కాలంగా పోలీసులు వికారుద్దీన్ కార్యకలాపాలపై నిఘా వేసి ఉంచినట్లు సమాచారం. వికారుద్దీన్ కు లష్కరే తోయిబాతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. కాల్పుల్లో రామరాజు అనే హెడ్ కానిస్టేబుల్ కడుపులోకి బుల్లెట్ దూసుకుపోయింది. కానిస్టేబుల్ జాఫర్ గాయపడ్డారు. వికారుద్దీన్ హైదరాబాదులోని మలక్ పేటకు చెందినవాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X