శాసనసభకు రాజీనామా చేస్తా: బాబు

ఆక్టోపస్ ను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆయన విమర్శించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా భైంసా దాడుల కేసు దర్యాప్తు పై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని ఆయన విమర్శించారు. హైదరాబాదు జంట పేలుళ్ల కేసును ఛేదించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. హోంమంత్రి కె. జానారెడ్డి అసమర్థుడని ఆయన తప్పు పట్టారు. ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర రెడ్డి తగరని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉగ్రవాద దాడుల కేసుల దర్యాప్తులు ముందుకు సాగడం లేదని, ప్రభుత్వం వాటి పట్ల ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications