మెదక్: సామాజిక న్యాయం అమలు చేయడం, బడుగు బలహీనవర్గాలకున్యాయం చేయడానికి ప్రజారాజ్యం పార్టీ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మెదక్ జిల్లా సింగన్నగూడెంలో ఏర్పాటు చేసిన సహపంక్తి భోజన కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. పేదలతో కలిసి భోజనం చేశారు.ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ, అంబేద్కర్ కాలంనాటి పరిస్థితులు ఇంకా మారలేదన్నారు. సామాజిక న్యాయాన్ని ఎవ్వరూ అమలు చేయనందునే తాను వచ్చానని ఆయన చెప్పారు. ఈ సహపంక్తి భోజనాలు ప్రజారాజ్యం లక్ష్యాలకు దర్పణంలాంటివని చిరు చెప్పారు.