హైదరాబాద్: రాజ్యాంగనిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఆయనకు నివాళులు అర్పించారు. ప్రజారాజ్యం పార్టీ కార్యాలయంలో ఆయన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ ఆధునిక యుగంలో కూడా అస్పృశ్యత కొనసాగటం సిగ్గుచేటని ఆయన ఈ సందర్భంగా అన్నారు. సామాజిక న్యాయాన్ని తాము అమలుచేసి చూపుతామని అన్నారు. అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ఈరోజు మబెదక్ జిల్లాలో చిరంజీవి సహపంక్తిభోజనాలు చేయనున్నారు.