బెంగుళూరు, చెన్నై విమానాశ్రయాల్లో హై ఎలర్ట్
న్యూఢిల్లీ: బ్లాక్‌డే సందర్భంగా ఈరోజు న్యూఢిల్లీ, బెంగుళూరు, చెన్నై విమానాశ్రయాల్లో హైఎలర్ట్ ప్రకటించారు. ఈ విమానాశ్రయాల్లో తీవ్రవాదులు విమానాల హైజాకింగ్‌కు ప్రయత్నిస్తున్నట్లు మెయిల్స్ రావటంతో పటిష్టమైన భద్రతను ఏర్పాటుచేశారు. సెక్యూరిటీ చెక్ కోసం ప్రయాణీకులు మూడు గంటలు ముందుగానే రావాలని తెలియజేశారు. హ్యాండ్‌బ్యాగ్‌లను ఎక్స్‌రేలతోను, మాన్యువల్‌గాను తనిఖీ చేస్తున్నారు. కార్లను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. సీఐఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌జీ కమెండోలు మూడు విమానాశ్రయాల్లో చురుగ్గా రక్షణ విధులను నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications