పాక్ లో క్షిపణి దాడి- ఆరుగురు మృతి
ఇస్లామాబాద్: పాక్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో పాక్ భూభాగంలోని ఓ గిరిజన ప్రాంతంలో జరిగిన క్షిపణి దాడిలో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా విమానాలే ఈ దాడులకు పాల్పడి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉత్తర వజీరిస్తాన్‌లోని మిరా అలీ పట్టణ సమీపంలోని ఖత్రియా గ్రామంలో ఈరోజు ఉదయం రెండు క్షిపణులు పడటంతో ఆరుగురు చనిపోయారని స్థానికులు చెప్పారు. తాలిబన్లే లక్ష్యంగా ఈ దాడులు జరిగి ఉండవచ్చని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications