హైదరాబాద్: హైదరాబాద్, ఆల్వాల్‌లో గత అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ చర్యను నిరసిస్తూ తెలంగాణ వాదులు ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. ఆల్వాల్ ప్రాంతానికి టిఆర్‌ఎస్ నాయకులు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.