తిరువనంతపురం: ఈ రోజు బ్లాక్‌డేని పురస్కరించుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా శబరిమలైలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సన్నిధానంలో 1300 మంది భద్రతా సిబ్బందిని నియమించారు. విపత్తు సమయంలో వెంటనే స్పందించేందుకు మరో 114 మందిని ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. మూడు దశల్లో భద్రతావ్యవస్థను ఏర్పాటుచేశారు. ఆలయ పరిసరాల్లో సెల్‌ఫోన్ జామర్లను, ఆలయం చుట్టూ 40 సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు.