ముంబయి: ముంబయి పేలుళ్ళ క్షతగాత్రులను మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఈ రోజు ఉదయం పరామర్శించారు.దాని నిమిత్తం ఆయన జెజె ఆస్పత్రిని సందర్శించారు.ఎందుకంటే ముంబాయి ఉగ్రవాద దాడుల్లో గాయపడిన క్షతగాత్రుల్లో ఎక్కువ మంది ఆ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని చవాన్ డాక్టర్లను కోరారు. ఈ రోజు మధ్యాహ్నం ముఖ్య శాఖల మంత్రులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. మహరాష్ట్ర ముఖ్యమంత్రిగా అశోక్ చవాన్ నిన్న(సోమవారం) ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.