హాట్రిక్..దీక్షిత్!

షీలా దీక్షిత్ పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను ఆమె అవలీలగా అధిగమించారు. పార్టీకి ముచ్చటగా మూడోసారి తిరుగులేని విజయాన్ని అందజేశారు. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ఢిల్లీలో ఓట్లను చీల్చకపోయి ఉంటే కాంగ్రెస్ మరిన్ని సీట్లు గెల్చుకొని ఉండేది.బీజెపికి కూడా బీఎస్పీ తన శక్తిమేర నష్టం కలగజేసింది. ఈసారి కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థుల ఎంపికను పూర్తిగా ముఖ్యమంత్రి షీలాకే కట్టబెట్టింది. అయినా ఢిల్లీలో కాంగ్రెస్ గెలిచిందనడం కన్నా షీలా విజయం సాధించారనడం సబబుగా ఉంటుందని అంతా అంటున్నారు. ప్రత్యర్థులను నిలువరించడమేకాదు పార్టీలో ఏళ్ల తరబడి నెలకొన్న కుమ్ములాటలనూ ఆమె సమర్థంగా ఎదుర్కొన్నారు.












Click it and Unblock the Notifications