విశాఖపట్నం: ప్రజారాజ్యం పార్టీ నేత నాగబాబు విశాఖ బీచ్‌రోడ్డులో జాలరిపేటవద్ద ఏర్పాటుచేసిన భారీ హనుమాన్ విగ్రహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మత్స్యకారుల సమస్యలపై మాట్లాడారు.తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మత్స్యకారులను ఆదుకుంటామని అన్నారు. వీరికోసం ప్రత్యేక ప్యాకేజి రూపొందిస్తామని అన్నారు. సెజ్‌లు, కోస్టల్ కారిడార్ల పేరిట ప్రభుత్వం గంగపుత్రులను తరిమేస్తోందని ఆయన అన్నారు.