ఢిల్లీలో తెలుగు నేతల ధర్నాలు

ఇదిలా ఉంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (ఎన్) అధ్యక్షుడు ఎ. నరేంద్ర తన అనుచరులతో జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. వచ్చే ఎన్నికల్లోగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ హామీ ఇచ్చారని, అందుకే బలపరీక్ష సమయంలో యుపిఎకు ఓటేశానని చెబుతూ వచ్చిన నరేంద్ర తన మాట ఉత్తిదేనని తేలడంతో ఈ ధర్నాకు దిగినట్లు కనిపిస్తోంది. ఒత్తిడి తెస్తే ప్రభుత్వం దిగిరాదనే ఉద్దేశంతో తాను ధర్నాకు దిగినట్లు నరేంద్ర చెప్పారు.












Click it and Unblock the Notifications