కసబ్ ను కోర్టులో హాజరు పరచరు
ముంబై: ముంబై దాడుల ఉగ్రవాది మొహమ్మద్ అజ్మల్ అమీర్ ఇమామ్ అలియాస్ కసబ్ ను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టడానికి ఇష్టపడడం లేదు. భద్రతా కారణాల రీత్యా అతన్ని కోర్టు హాజరు పరచడం సాధ్యం కాదని వారంటున్నారు. దీంతో కసబ్ ను తమ కస్టడీలోనే విచారించాలని కోరుతూ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మెజిస్ట్రేట్ కు పిటిషన్ పెట్టుకున్నారు.
భద్రతా కారణాల రీత్యా కసబ్ ను కోర్టుకు తీసికెళ్లలేకపోతున్నామని, రిమాండ్ విచారణను తమ కస్టడీలోనే చేపట్టాలని మెజిస్ట్రేట్ ను కోరుతున్నామని జాయింట్ పోలీసు కమీషనర్ (క్రైం) రాకేష్ మారియా చెప్పారు. ముంబై దాడులకు పాల్పడిన పది మంది టెర్రరిస్టుల్లో కసబ్ మాత్రమే పోలీసులకు చిక్కాడు. అతను నవంబర్ 27వ తేదీ నుంచి పోలీసు కస్టడీలో ఉన్నాడు. అతన్ని గురువారం కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంది.












Click it and Unblock the Notifications