రెండు రోజుల్లో వర్గీకరణ బిల్లు: వైయస్
హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు పార్లమెంటులో రెండు రోజుల్లో బిల్లు ప్రతిపాదించనున్నట్లు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) తన నిరవధిక నిరశన దీక్షను గురువారం ఉదయం విరమించింది. ఎస్సీల వర్గీకరణను సత్వరం చేపట్టాలని కోరుతూ నిరవధిక నిరశనలు ఎమ్మార్పీఎస్ నిరవధిక నిరశన దీక్షలను చేపట్టింది. బుధవారం రాత్రినుంచి హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద ఎమ్మార్పీయస్ కార్యకర్తలు దీక్షలు చేస్తున్నారు.
ఎమ్మార్పీయస్ డిమాండ్లకు సీఎం సానుకూలంగా స్పందించటంతో ఆందోళనను విరమించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈనెల 15వ తేదీలోపు తమ డిమాండ్‌కు చట్టబద్దత కల్పించకపోతే ఆమరణ నిరాహారదీక్షలు చేపడతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. 16వ తేదీ నుంచి తమ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications