కెసిఆర్, బాబులపై దేవేందర్ గుర్రు

Devender Goud
హైదరాబాద్‌: తెలుగుదేశం, వామపక్షాలు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లతో ఏర్పడిన కూటమిపై నవ తెలంగాణ పార్టీ (ఎన్టీపీ) నేత టి. దేవేందర్ గౌడ్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఆ కూటమిని కులాల కూటమిగా ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో కొన్ని పార్టీలు కూటమిగా ఏర్పడి మహా లావుగా ఉన్నాయని అనుకుంటున్నాయని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. కులాల దారంతో ఏర్పడిన ఆ కూటమి బలమెంతో ప్రజలే తేలుస్తారని ఆయన అన్నారు.

కొన్ని పార్టీలు ఉదయం ఒకరితో సాయంత్రం మరొకరితో పొత్తుల గురించి మాట్లాడుతున్నాయనీ, పొత్తులతో ప్రజాభిప్రాయాన్నే మార్చాలనుకుంటున్నాయని ఆయన తెరాసనుద్దేశించి విమర్శించారు. ఈ ప్రయత్నాలు వికటించి ప్రజలు చేయాల్సింది చేస్తారని అన్నారు. తమ పార్టీ కూడా పొత్తుల గురించి యోచిస్తున్నప్పటికీ వాటి పేరుతో నవ్వులపాలుకాదల్చుకోలేదన్నారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. తమ పార్టీ ప్రజల కోసం నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపడుతుందని, వార్తలను సృష్టించుకొని వార్తల చుట్టూ తిరిగే పార్టీ తమది కాదంటూ తెరాసను దెప్పిపొడిచారు.

బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం మొదలవుతున్నప్పుడు తాను తెలుగుదేశంలో ఉన్నానని, ఆనాడే ఆందోళన చేసి అరెస్టయ్యానని, తెలంగాణ రాష్ట్ర సమితి అప్పట్లో బాబ్లీపై కనీసస్థాయిలోనైనా స్పందించలేదని దేవేందర్‌గౌడ్‌ పేర్కొన్నారు. ఇప్పుడు కొత్తచుట్టరికాలు కలుపుకొని ఢిల్లీయాత్ర చేపట్టారని, బాబ్లీ ప్రాజెక్టును నిలిపివేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని తాను తప్పుపట్టడంలేదని, ఇదే ప్రయత్నం ఆనాటి నుంచి ఉంటే బాగుండేదని ప్రాజెక్టు నిర్మాణం ఆగి ఉండేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+