ప్రమాదంలో 22 మంది పిల్లల మృతి
ఖాట్మండు: నేపాల్‌లో జరిగిన ఓ రోడ్డుప్రమాదంలో 22 మంది స్కూలు పిల్లలు మృతి చెందారు. ఖాట్మండుకు 200 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగింది. స్కూలుపిల్లలతో పిక్నిక్‌కు వెళ్లి తిరిగివస్తున్న బస్సు ముకుందాపూర్ వద్ద బోల్తా పడింది. దీంతో 22 మంది మృతిచెందగా 57 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 80 మంది వరకు పిల్లలు ఉన్నారు. పిల్లలంతా తొమ్మిది, పదేళ్ల వయసువారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
గాయపడినవారిని చికిత్స నిమిత్తం వివిధ ఆస్పత్రుల్లో చేర్చినట్లు పోలీసు అధికారి లేన్ ప్రతాప్ సేన్ చెప్పారు. రోడ్లు, వాహనాల నిర్వహణ సరిగా ఉండనందున నేపాల్ లో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారాణమే. జాతీయ రహదారులపై వేగానికి సంబంధించిన పరిమితులు లేవు.












Click it and Unblock the Notifications