హైదరాబాదులో విధ్వంసం: ఉద్రిక్తత
హైదరాబాద్: వీహెచ్‌పీ, భజరంగదళ్ కార్యకర్తల ఆందోళనలతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాదులోని కోఠీ బస్టాండు సమీపంలో ఉమెన్స్ కాలేజీవద్ద ఉన్న పోచమ్మ ఆలయాన్ని రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఇందుకు నిరసనగా వీహెచ్‌పీ, భజరంగదళ్ కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చినా వారు ఖాతరుచేయలేదు. దీంతో కోఠీ, చాదర్‌ఘాట్, ఆబిడ్స్ ప్రాంతంలో ట్రాఫిక్ భారీగా స్థంభించింది. ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆందోళనకారులు కోఠీలో ఆర్టీసి జీపును దగ్ధం చేశారు. అలాగే హైదరాదులోని కాచిగుడాలో ఒక ఆర్టీసి బస్సుకు నిప్పు పెట్టారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సును రంగంలోకి దించారు. బస్సులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. కోఠీ తదితర ప్రాంతాల్లో దుకాణాలు మూసివేశారు. ఆందోళనకారులు రాళ్లు రువ్విన సంఘటనలో పోలీసులు కూడా గాయపడ్డారు. మున్సిపల్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాశ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కూల్చిన చోటనే గుడిని తిరిగి నిర్మిస్తామని హామీ ఇచ్చినా ఆందోళనకారులు వెనక్కి తగ్గింది.












Click it and Unblock the Notifications