పీఏసీలో కాంగ్రెస్ మైకుల కుస్తీ
హైదరాబాద్: పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో సోమవారం తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. కమిటీ ఛైర్మన్ యనమల రామకృష్ణుడు లేని సమయంలో ఎల్లంపల్లి ప్రాజెక్టుపై ప్రభుత్వం క్లీన్ చిట్ ఇవ్వటాన్ని విపక్ష సభ్యులు తప్పుబట్టారు. కమిటీ దీనిపై చర్చించాలని కోరారు. అందుకు అధికారపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముగిసిన అంశంపై తిరిగి విచారణ జరపటం పిఏసీ చరిత్రలోనే లేదని క్లీన్‌చిట్ సమయంలో ఛైర్మన్‌గా ఉన్న కనుమూరి బాపిరాజు అన్నారు.
విపక్షాల వైఖరికి నిరసనగా అధికారపక్ష సభ్యులు మైకులు పీకి విసిరి పారేశారు. ముగిసిన అంశంపై సమాధానం ఇవ్వటానికి వీల్లేదంటూ అధికారులను అడ్డుకున్నారు. దీంతో తీవ్ర గందరగోళం మధ్య కమిటీ సమావేశం రేపటికి వాయిదాపడింది. చర్చ సమయంలో మైకు లాక్కుని విసిరి కొట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ప్రతిపక్షాలు విమర్శించాయి. చర్చ రేపు కొనసాగుతుందని యనమల రామకృష్ణుడు చెప్పారు.












Click it and Unblock the Notifications