చావుకెళ్తే మృత్యువు కాటేసింది
నల్గొండ: నల్లగొండ జిల్లాచివ్వెంల మండలం వల్లభాపురం వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి చెందారు. గోనె శ్రీనివాస్, ఆయన కుమారుడు రాము తమ గ్రామంలో ఓ మహిళ మృతిచెందగా అక్కడకు వెళ్లారు. ఆ తర్వాత వ్యవసాయబావి వద్ద స్నానం చేసేందుకు సైకిల్‌పై వెళుతుండగా ఓ కారు వీరిని వెనుకవైపునుంచి ఢీకొట్టింది. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందారు.
తీవ్ర గాయాలపాలైన ఆయన కుమారుడు రాము సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్రీనివాస్ కు పెళ్లి కావలసిన ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. తండ్రి మృతితో వారంతా దిక్కులేనివారయ్యారు.












Click it and Unblock the Notifications