ఇళ్ల అప్పులపై వడ్డీ రేట్ల తగ్గింపు
ముంబయి: గృహరుణాలపై ప్రభుత్వ రంగ బ్యాంకుల వడ్డీరేట్లు తగ్గనున్నాయి. ఈమేరకు బ్యాంకుల సంఘం ఓ ప్రకటన చేసింది. 5 లక్షల రూపాయలలోపు రుణాలకు ఇక వడ్డీ 8.5 శాతం, 20 లక్షల లోపు రుణాలకు 9.25 శాతంగా ఉంటుంది. 5 లక్షలలోపు రుణాలకు ప్రీపేమెంట్, ప్రాసెసింగ్ ఛార్జిలు ఉండవు. ఈ పరిధిలోని రుణాలకు బీమా, ఇన్సూరెన్స్‌లను బ్యాంకులే భరిస్తాయి.
ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన పథకం నేపథ్యంలో ఈ రెండు స్కీంల కింద వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ చైర్మన్ ఒపి భట్ చెప్పారు. ఈ స్కీంల కింద జూన్ 30వ తేదీ వరకు రుణాలు ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. ఐదేళ్ల కాల పరిమితి ఉంటుందని, ఆ తర్వాత మార్కెట్ పరిస్థితులను బట్టి అప్పులు తీసుకునే వారు ఫ్రీ లేదా ఫ్లోటింగ్ రేట్లను ఎంచుకోవాలని ఆయన సూచించారు. ఐసిఐసిఐ, హెచ్ డిఎఫ్ సి బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను తగ్గించడానికి ముందుకు వస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications