మేనమామగానే బుజ్జి పరిచయం
హైదరాబాద్: ప్రవీణ్ కుమార్ అలియాస్ బుజ్జిని నటి భార్గవి సినీ, టీవీ పరిశ్రమలకు తన మేనమామగానే పరిచయం చేసినట్లు చెబుతున్నారు. భార్గవి మృతితో సినీ, టీవీ పరిశ్రమలు దిగ్భ్రాంతికి గురయ్యాయని. అష్టాచెమ్మ విజయంతో భార్గవికి అవకాశాలు పెరిగాయి. పది సినిమాల్లో ఈ ఆమెకు అవకాశాలు వచ్చాయి. హాలిడేస్ చిత్రంలో ఆమె నటిస్తోంది. ఈ సినిమా యాభై శాతం దాకా పూర్తయింది. మంగళవారం ఉదయం ఎస్ఎస్ కుమార్ సినిమా ప్రారంభం కావాల్సి వుంది. ఆ సినిమా షూటింగుకు హాజరు కావడానికే ఆమె సోమవారం ఉదయం స్వస్థలం గుంటూరు జిల్లా గోరంట్ల నుంచి హైదరాబాదు వచ్చింది.
సోమవారం ఉదయం రాగానే మంచినీళ్లు కావాలని ఇంటి యజమానురాలిని అడిగింది. దాంతో తాను మోటారు వేశానని యజమానురాలు చెప్పింది. అంతకు మించి ఏమీ తెలియదని ఆమె చెప్పింది. కాగా, ఆమెతో సినిమాలు చేస్తున్నవారంతా ఆమె ప్రవర్తన పట్ల, క్రమశిక్షణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. బుజ్జిని తమకు మేనమామగా పరిచయం చేసిందని, తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా చెప్పిందని సినిమాల్లో ఆమెతో పాటు కలిసి పనిచేసినవారు చెబుతున్నారు. షూటింగుకు చక్కగా సహకరించేదని టీవీ నిర్మాతలతో పాటు సినీ నిర్మాతలు కూడా చెబుతున్నారు.
బుజ్జి మొదటి రోజు తమ వద్దకు వచ్చాడని ఒక టీవీ సీరియల్ నిర్మాత కుమార్ రెడ్డి చెప్పాడు. తమ సీరియల్ పూర్తయిందని, పోస్టు ప్రొడక్షన్ మాత్రమే మిగిలి ఉందని ఆయన చెప్పారు. ఆమె ప్రస్తుతం శ్రీ శ్రీమతి సీరియల్లో నటిస్తోంది. భార్గవి మరణం బాధ కలిగిస్తోందని ఎస్ఎస్ కుమార్ అన్నారు.












Click it and Unblock the Notifications