వైయస్ 'చీప్' మినిస్టర్: హరికృష్ణ

వైఎస్ కుటుంబం అవినీతి డబ్బుతో పరిశ్రమలు, పత్రికలు ఏర్పా టు చేసిందని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుతడు కె. ఎర్రంనాయుడు ఆరోపించారు. చివరకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా అవినీతిని ప్రశ్నించే సాహసం చేయలేకపోతున్నారని రాజ్యసభ సభ్యుడు ఎంవి మైసూరా రెడ్డి అన్నారు. అన్నింటికీ ఇందిరా గాంధీ పేరుపెట్టే వైఎస్ బెల్టు షాపులకు సోనియాగాంధీ పేరు పెడితే మేలని తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజా వ్యంగ్యాస్త్రం విసిరారు. రాష్ట్రం లో మంచినీరు దొరకని ప్రాంతాల్లో కూడా బెల్టుషాపులు పెట్టించిన ఘనత వైఎస్‌కే దక్కిందన్నారు.












Click it and Unblock the Notifications