లెప్ట్ నేతలతో బాబు విందు భేటీ

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మంగళవారం ఉదయం వామపక్షాల నాయకులకు అల్పాహార విందు ఇచ్చారు. ఈ విందు భేటీలో పొత్తులపై తెలుగుదేశం, వామపక్షాల నాయకులు చర్చలు జరిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, కె. నారాయణలతో పాటు చాడ వెంకటరెడ్డి, వెంకటేశ్వరరావు తదితరులు చంద్రబాబు ఇంటికి వచ్చారు. తెలుగుదేశం సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, కెఇ కృష్ణమూర్తి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

పొత్తులపై తెలుగుదేశం, వామపక్షాల నాయకులు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో మంగళవారంనాడు సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుపై తమ ప్రతిపాదనలను చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం. ఈ విషయంలో మూడు పార్టీల మధ్య ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. తమతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా కలిసి వస్తుందని తెలుగుదేశంతో పాటు వామపక్షాలు కూడా గట్టిగా నమ్ముతున్నాయి. తెరాస కలిసి వస్తే సీట్ల సర్దుబాటు ఎలా ఉండాలనే విషయంపై కూడా ప్రాథమికంగా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+