మేయరుగా అల్లు అరవింద్ బంధువు
విజయవాడ: విజయవాడ కొత్త మేయర్ గా ముత్తంశెట్టి రత్నబిందు మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2005నుంచి ఒప్పందం ప్రకారం కాంగ్రెస్, సీపీఐకి చెందిన ఇద్దరు మేయర్లుగా ఎన్నికయ్యారు. సీపీఐకి చెందిన శకుంతల తొలిఏడాది మేయర్‌గా పనిచేశారు. అనంతరం కాంగ్రెస్ తరపున ఎంపీ రాజగోపాల్ మద్దతుతో మలికాబేగం రెండేళ్లు మేయర్‌గా పనిచేశారు.
ఈసారి ఎమ్మెల్యే వంగవీటి రాధ వర్గానికి చెందిన ముత్తంశెట్టి రత్నబిందు కాంగ్రెస్ తరపున కొత్త మేయర్ అయ్యారు. రత్నబిందు ప్రజారాజ్యం పార్టీ నేత అల్లు అరవింద్ కు సమీప బంధువు కావడం విశేషం. బుధవారం మేయర్ ఎన్నికకు 63 మంది సభ్యులు వచ్చారు. మొత్తం సభ్యుల సంఖ్య 65. నిజానికి రెండేళ్ల క్రితమే రత్నబిందు మేయర్ కావాల్సి ఉండింది. కానీ కరీంనగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మైనారటీలను దువ్వడానికి మల్లికా బేగం పేరును ముందుకు తెచ్చారు. దీంతో మల్లికా బేగం మేయర్ గా ఎన్నికయ్యారు. రత్నబిందు మూడో మేయరుగా మంగళవారం ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications