రాజీనామా దిశలో టిపిడి ఎమ్మెల్యే కళా
శ్రీకాకుళం: తెలుగుదేశం శాసనభ్యుడు కళా వెంకటరావు పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. ఎర్రంనాయుడి ఏకపక్ష ధోరణికి ఆయన అలిగినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో ఎర్రంనాయుడు పార్టీ నాయకుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పార్టీని ఎర్రంనాయుడు నాశనం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
కళా వెంకటరావు చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే తమ్మినేని సీతారాం వంటి నాయకులు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ప్రజారాజ్యంలో చేరారు. ఉత్తరాంధ్రలో ప్రజారాజ్యం వల్ల తెలుగుదేశం పార్టీ నష్టం గణనీయంగానే జరిగింది. పార్టీకి రాజీనామా చేసినవారంతా ఎర్రంనాయుడిపైనే విమర్శలు చేస్తుండడం గమనార్హం.












Click it and Unblock the Notifications