కెఎస్ రాజు గుండెపోటు హల్ చల్
హైదరాబాద్: డిపాజిట్‌దారులకు టోకరా పెట్టిన అభియోగంపై అరెస్టయిన నాగార్జున ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరక్టర్ సత్యనారాయణరాజు అర్థరాత్రి చంచల్‌గూడ జైలులో హడావుడి సృష్టించారు. ఈనెల 15న అరెస్టయిన ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు. గుండెపోటు వచ్చిందంటూ బుధవారం రాత్రి ఆయనను అక్కడినుంచి పోలీసులు హడావుడిగా గాంధీ ఆసుపత్రికి తరలించారు.
అక్కడి నుంచి ఆయనను నిమ్స్ కు తరలించారు. అయితే ఆయనను ఎక్కడకు తీసుకెళుతోందీ స్పష్టంగా చెప్పలేదు. కేర్ ఆస్పత్రికనీ, ఉస్మానియాకని మీడియాకు భిన్న రకాలుగా చెప్పారు. చివరకు నిమ్స్‌లో చేర్చారు. అయితే గుండెపోటు వస్తే అంబులెన్సులో కాకుండా మామూలు వాహనంలో తీసుకెళ్లటం, నిమ్స్‌లో అత్యవసరవిభాగానికి తీసుకురాకపోవటం అనుమానాలకు తావిస్తోంది. కెఎస్ రాజుకు ఎలాంటి ప్రాణాపాయం లేదని గాంధీ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications