చిరు గాలికి బాలయ్య బ్రేక్

తొలిదశలో బాలకృష్ణ పార్టీ నేతలతో సమాలోచనలు జరిపి పార్టీ పరిస్థితిని పూర్తిస్థాయిలో ఆకళింపు చేసుకుంటారు. తర్వాత జిల్లాల్లో తన ప్రచార సరళి ఎలా ఉండాలన్న దానిపై దృష్టిపెట్టనున్నారు. చంద్రబాబు, బాలయ్యల మధ్య ప్రజారాజ్యం పార్టీ పరిస్థితి కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ, రాయలసీమల్లో ఆ పార్టీ బలహీనంగా ఉందని, గోదావరి జిల్లాల్లో కొన్ని స్థానాల్లో కొంతవరకు పట్టుందన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల ముఖ్యనేతలతో బాలయ్య మాట్లాడితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. షూటింగ్ సమయంలో అందరూ వస్తే ఇబ్బందులు ఎదురవుతాయాని, అందువల్ల పగలు షూటింగ్, సాయంత్రం వేళల్లో భేటీలుజరుపుతానని బాలయ్య చెప్పినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications