హైదరాబాద్: క్రిస్మస్ వేడుకలను ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పులివెందులలో జరుపుకోనున్నారు. బంధుమిత్రులతో కలిసి క్రిస్మస్ జరుపుకునేందుకు వీలుగా కడప జిల్లాలో పర్యటనలను అందుకు అనుగుణంగానే రూపొందించుకున్నారు. ఈరోజునుంచి ఆయన కడపజిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు వెలిగల్లు ప్రాజెక్టును ఆయన జాతికి అంకితం చేస్తారు. 24న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. పలు ఎత్తిపోతల పథకాలకు, రాజోలి రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేస్తారు. 25న పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని 26 హైదరాబాద్ తిరిగి వస్తారు.