సికింద్రాబాద్-కాకినాడ ప్రత్యేక రైళ్ళు
హైదరాబాద్: సికింద్రాబాద్-కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) ముఖ్య ప్రజా సంబంధాల అధికారి పనబాక కృష్ణయ్య తెలిపారు. సికింద్రాబాద్-కాకినాడ టౌన్ స్పెషల్ (నెంబర్ 700) ఈనెల 27, 28వ తేదీల్లో సికింద్రాబాద్ నుంచి రాత్రి 10.30గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.50గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కాకినాడ టౌన్-సికింద్రాబాద్ స్పెషల్ (నెంబర్ 701) ఈనెల 29వ తేదీన కాకినాడ టౌన్ నుంచి రాత్రి 7.30గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. . ఈ ప్రత్యేక రైలు ఖాజీపేట్,వరంగల్,ఖమ్మం, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామలకోట్‌ల మీదగా రాకపోకలు సాగిస్తుందని ప్రకటనలో తెలిపారు. ప్రయాణీకుల సౌకర్యార్థం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(బోయిగూడ వైపు)లోని నూతన బుకింగ్ ఆఫీసులో బుధవారం కొత్తగా కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ ప్రారంభించారు.












Click it and Unblock the Notifications
