దసరాకు ప్రయాణాలు ప్లాన్ చేసుకున్న రైల్వే ప్రయాణీకులకు బిగ్ అప్డేట్..!!
తెలుగు రాష్ట్రాల్లో పండుగల వేళ సొంతూళ్లకు వెళ్లేందుకు పలువురు సిద్దం అవుతున్నారు. సొంత వాళ్లతో కలిసి చేసుకునే వినాయక చవితి తో పాటుగా దసరా పండుగ వేళ సొంత ఊళ్లల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందు కోసం ముందస్తుగానే రైలు రిజర్వేషన్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగించే పలు ప్రధాన రైళ్లు ఇప్పటికే ఫుల్ అవ్వగా.. ప్రత్యేక రైళ్ల కోసం వేచి చూస్తున్నారు. ఇక, వందేభారత్ రైళ్లల్లోనూ ఖాళీలు ఉండటం లేదు.
వినాయక చవితి, దసరా పండులకు సొంత ఊళ్లకు ప్రయాణాలు ఖరారు చేసుకున్న వారికి బిగ్ అప్డేట్. ఈ నెల 14న సోమవారం వినాయక చవితి, అక్టోబరు 20 మంగళవారం విజయదశమి కావడంతో దూర ప్రాంతాలకు వెళ్లే వారికి రైల్వే ప్రయాణం పరీక్షగా మారుతోంది. ఇప్పటికే పలు ప్రధాన రైళ్లల్లో వెయిటింగ్ లిస్టు కొనసాగుతోంది. వందల సంఖ్యలో నిరీక్షణ జాబితా దర్శనం ఇస్తుండగా.. మరి కొన్ని రైళ్లల్లో రిగ్రెట్ చూపిస్తోంది. ఈ సారి వినాయక చవితికి ముందు రెండు రోజులు వరుస సెలవులు (రెండో శనివారం, ఆదివారం) కలిసి రావడంతో ప్రయాణాల కు ప్లాన్ చేసుకున్నారు. అయితే ,రైళ్లు ముందస్తుగానే ఫుల్ అయ్యాయి. దీంతో.. తాత్కాల్ కు విపరీతంగా డిమాండ్ పెరిగింది. అయినా.. చాలా మందికి టికెట్లు అందలేదు. ఈ కారణంతో ప్రయివేటు బస్సులు.. వాహనాల ద్వారా గమ్య స్థానాలకు వెళ్లాల్సి వస్తోంది.

ప్రధాన రైళ్లు ఫుల్
ఇక.. హైదరాబాద్ నుంచి ప్రధానంగా విశాఖ,చెన్నై, బెంగళూరు మార్గాల్లో రైళ్లు ఖాళీ లేవు. విశాఖ వైపు వెళ్లే ట్రైన్లు 12 ఉన్నప్పటికీ రిజర్వేషన్ అందుబాటులో లేదు. విశాఖ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్ క్లాస్, గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో 'రిగ్రెట్' చూపిస్తోంది. ఎల్‌టీటీ విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో 12న రిగ్రెట్ ఉంది. వందేభారత్ రైళ్లు రెండున్నప్పటికీ వాటిల్లోనూ వెయిటింగ్ లిస్ట్ వందల్లో ఉంది. పండుగ రద్దీ ఎఫెక్ట్ డైలీ రైళ్లకే కాకుండా వీక్లీ రైళ్లలోనూ కనిపిస్తోంది. ఇక.. దసరా పండుగకు ముందు రోజుల్లోనూ మెజార్టీ ట్రైన్లలో రిజర్వేషన్లు అయిపోయాయి. దీంతో.. రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. హైదరాబాద్-విశాఖ, హైదరాబాద్-కాకినాడ, హైదరాబాద్-తిరుపతి రూట్లలో అదనపు సర్వీసులు కావాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీంతో.. ఇప్పుడు రైల్వే శాఖ తీసుకునే నిర్ణయం కోసం ప్రయాణీకులు వేచి చూస్తున్నారు.













Click it and Unblock the Notifications
