సొంతగడ్డపై సిఎం క్రిస్మస్ ప్రార్ధనలు
కడప: ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గురువారం సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు. ఉదయం పులివెందులలో సిఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో కుటుంబ సభ్యులతో పాల్గొని ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు సందేశాన్నిచ్చారు. ఏసుక్రీస్తు ప్రబోధించిన శాంతి, అహింస, పరస్పర సానుభూతి వంటి మానవతా విలువలు అన్ని కాలాలకు, అన్ని తరాలకు వర్తించే సార్వ జనీన జీవన సత్యాలని పేర్కొన్నారు. అనంతరం వైఎస్ పలు అభివృద్ధిపనులు, ప్రారంభోత్సవాలతోపాటు శంకుస్థాపనలు చేయనున్నారు.












Click it and Unblock the Notifications
