పాక్ నిజస్వరూపం ఇదే
ఇస్లామాబాద్ : లాహోర్‌లో బుధవారం జరిగిన ఒక కారుబాంబు దాడిలో భారతీయుడ్ని అరెస్టు చేసినట్లు పలు పాక్ టెలివిజన్ చానల్స్ వార్తలను ప్రసారం చేశాయి. అయితే లాహోర్‌లో దాడికి పాల్పడింది తామేనని పాక్ ఉగ్రవాద తాలిబన్ అనుబంధ సంస్థ అన్వర్ వా మొహజీత్ శుక్రవారం ప్రకటించింది. దీంతో పాక్ నిజస్వరూపం బట్టబయలు అయింది. పాకిస్తాన్ కట్టుకథలు అల్లి భారత్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నమేనని తేటతెల్లమయింది. లాహోర్ ప్రభుత్వ అధికారుల నివాస ప్రాంతానికి సమీపంలో బుధవారం జరిగిన పేలుడులో ఒక మహిళ చనిపోగా, నలుగురు గాయపడిన విషయం విదితమే.












Click it and Unblock the Notifications