ఇద్దరు నకిలీ నక్సల్స్ అరెస్ట్
భువనగిరి: నక్సల్స్‌మంటూ డబ్బు వసూలు చేస్తున్న ఇద్దరు దొంగలను నల్గొండ జిల్లా భువనగిరి పోలీసులు అరెస్టు చేశారు. ఆదిలాబాద్ జిల్లా కారంగి గ్రామానికి చెందిన గణేష్‌రెడ్డి, వరంగల్ జిల్లా కడవెండ్ల గ్రామానికి చెందిన వేణులు రాజన్న దళం మావోయిస్టులమంటూ భువనగిరిలో రైస్‌మిల్లర్ల వద్దనుంచి డబ్బు వసూలుచేశారు. బాధితుల ఫిర్యాదుమేరకు పోలీసులు వలపన్ని వారిని పట్టుకున్నారు. ఇందులో వేణుపై గతంలో 22 కేసులు నమోదై ఉన్నాయి.












Click it and Unblock the Notifications