ముంబయి: పేలుళ్లు జరిగినప్పుడల్లా లోకల్ ట్రైన్లే తీవ్రవాదుల లక్ష్యంగా మారుతూండటం తెలిసిందే. దాంతో ముంబయికి అత్యంత కీలకంగా మారిన లోకల్ ట్రెయిన్లలో ఇక సీసీ కెమెరాలు పెట్టాలని ఆ శాఖ యోచిస్తోంది. ఈ ప్రతిపాదనను రైల్వే రక్షక దళం పెట్టింది. ఇందుకు ఉన్నతాధికారుల అనుమతి లభించింది. ముంబయిలోని 110 రైళ్లలో ఈ కెమెరాలను రహస్యప్రదేశాల్లో అమర్చుతారు. త్వరలోనే తేదీని ప్రకటిస్తారు.