న్యూఢిల్లీ : తమ దేశంలో ప్రపంచానికి ప్రమాదకరంగా పరిణమించే ఉగ్రవాద సంస్థలు అసలు లేవని పాకిస్థాన్ కామెంట్స్ కి భారత్ చెక్ చెప్పింది. ఈ మేరకు రక్షణ మంత్రి ఆంటోని పాక్‌లో క్రియాశీల ఉగ్రవాద సంస్థల గురించి సోదాహరంగా ఓ ప్రకటన ద్వారా వివరించారు. పాక్‌లో మొత్తం 330 క్రియాశీల ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయని, ఇందులో పది సంస్థలు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనవని ఐరాస నివేదికను ఆయన బహిర్గతం చేసారు. అంతర్జాతీయ సమాజం ముందు పాక్ తలదించుకునే పరిస్థితి తలెత్తినా, ఇంకా ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఆంటోని తప్పుపట్టారు. పాక్ అంతిమంగా భారత్‌పై యుద్ధమే ప్రకటిస్తే, దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.