ధోని బెదిరింపు కేసులో ముగ్గురి అరెస్టు

బుధవారం భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బెదిరింపు లేఖ అందింది. తక్షణం యాభై లక్షల రూపాయలు చెల్లించకపోతే కుటుంబ సభ్యుల అంతు చూస్తామన్నది ఆ లేఖ సారాంశం. ఈ లేఖ పర్యవసానంగా ధోనీకి, ఆయన కుటుంబసభ్యులకు సెక్యూరిటీని పెంచినట్టు పోలీసు అధికారులు బుధవారం ఉదయమే ప్రకటించారు.
దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ సభ్యుడినని చెప్పుకుంటూ ఒక వ్యక్తి ఈ లేఖను తెచ్చి, ధోనీ కుటుంబ సభ్యులకు అందజేసినట్టు సమాచారం. అయితే ఆ లేఖ ఎంతో దూరం నుంచి రాలేదని ధోనీ నివాస ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న కాలనీ నుంచి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. "స్ధానిక నేరస్ధులే" ఆ లేఖను పంపించి ఉండవచ్చని పోలీసులు అంటున్నారు.
అండర్ వరల్డ్ మాఫియా హస్తం గురించి ఎటువంటి ఆధారాలు లేవని జార్ఖండ్ పోలీసు ఇన్ స్పెక్టర్ జనరల్ ఎ ఎన్ ప్రధాన్ చెప్పారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, ఈ సమస్య త్వరలో పరిష్కారమవుతుందని ఆయన తెలిపారు. ధోనీకి ఇప్పటికే జెడ్ క్యాటగిరీతో సమానమైన సెక్యూరిటీ ఉందని, ఈ బెదిరింపు లేఖ పర్యవసానంగా ఇంకా అదనపు పోలీసు బలగాలను ఇచ్చామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications