సత్యంకు ఐదువేల కోట్ల సమస్య?
హైదరాబాద్: సత్యం కంపెనీపై ఇంగ్లండ్‌లోని యు పెయిడ్ అనే కంపెనీ కేసు దాఖలు చేసిందనీ, ఈ కేసులోని ఆరోపణలు రుజువైతే కంపెనీ రూ.5 వేల కోట్లను పరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని ప్రముఖ స్టాక్‌మార్కెట్ నిపుణుడు రమేష్‌చంద్ర చెప్పారు.అలాగే ఈ రోజును భారత కార్పొరేట్ చరిత్రలో 'బ్లాక్ డే' అని ఆయన అభివర్ణించారు. 'సత్యం' రామలింగరాజు రాజీనామా ఈరోజు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సత్యం కంపెనీ చాలా రోజుల నుంచి అనేక సమస్యలతో సతమతమవుతోందని ఆయన చెప్పారు. ఏదేమైనా ప్రపంచవాప్తంగా పేరెన్నెకగన్న సత్యంలో ఇటుంవంటి దురదృష్టకర పరిణామాలు చోటుచేసుకోవటం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications