రాష్ట్రానికి పెద్దకొడుకుగా మారతా:చిరంజీవి

సోమవారం రాత్రి నెల్లూరులో బస చేసిన చిరంజీవి.. మంగళవారం కోవూరు సభతో మూడోరోజు యాత్రను ప్రారంభించారు. ఆయా సభల్లో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో నువ్వు రూ.10 కోట్లు తిన్నావంటే.. నువ్వు రూ.100 కోట్లు తిన్నావని తిట్టుకునే రాజకీయ నాయకులు.. తాము ప్రజల సొమ్ము తినలేదని మాత్రం అనడంలేదు. నేటి రాజకీయాలు నికృష్టంగా మారాయి. ఇలాంటి రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేందుకే ప్రజారాజ్యం వస్తోంది. ఒక్క ఛాన్స్ ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. దాన్ని సద్వినియోగం చేసుకొని మీ జీవితాల్లో ఇప్పుడు కనిపిస్తున్న సంతోషాన్ని శాశ్వతం చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను.. అని చిరంజీవి ప్రజలకు వాగ్దానం చేశారు.












Click it and Unblock the Notifications