వైయస్ కు గుండు గొరగండి:కేసీఆర్

గ్రేటర్ హైదరాబాద్ యువజన విభాగం అధ్యక్షుడు కేపీ వివేకానంద ఆధ్వర్యంలో సుమారు 500 మంది అనుచరులతో నాయీ బ్రాహ్మణ సంఘ కార్యదర్శి ఉప్పల భీంరావు మంగళవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్లో గులాబీ కండువా కప్పి వారిని కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు దామాషా పద్ధతిలో బడ్జెట్‌లో 50 శాతం నిధులు కేటాయిస్తామని చెప్పారు. నాయీ బ్రాహ్మణులకు పావలా వడ్డీకే లక్ష రూపాయల రుణం ఇస్తామని, హెయిర్ కటింగ్ సెలూన్లకు విద్యుత్‌ను కమర్షియల్ నుంచి నివాసిత ప్రాంతాల కేటగిరీలోకి మారుస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications
