భారత్ పై జిహాద్ తప్పదు
ఇస్లామాబాద్:''భారత్ యుద్ధానికి దిగితే జిహాద్ అనుసరించక తప్పదు.. పాకిస్థానీయులంతా ఇందులో పాల్గొనాలి'' అంటూ పాకిస్థాన్ మతపెద్దలు ఫత్వా జారీ చేసారు. లాహోర్‌లో తహఫుజె నమూసె రిసాలత్ మహజ్ (టీఎన్‌ఆర్‌ఎం) ఆధ్వర్యంలో మంత్రి నూరుల్ హక్ ఖాద్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మత పెద్దలు ఈ ఫత్వా జారీ చేశారు.
'భారత్ తోయుద్ధ ప్రమాదం' పరిస్థితుల్లో తీసుకోవాల్సిన భద్రత చర్యలపై చర్చించడానికి జరిగిన ఈ సమావేశానికి పాక్ మంత్రి నూరుల్ హక్ ఖాద్రి అధ్యక్షత వహించారు. 'భారత దేశమే యుద్ధానికి దిగిన పక్షంలో పాకిస్థానీయులు జిహాద్‌కు దిగడం తప్పనిసరి. దేశ పశ్చిమ సరిహద్దుల్లో అమెరికా జరుపుతున్న యుద్ధానికి ప్రభుత్వం సహకరించరాదు కూడా' అని ఆ ఫత్వాలో స్పష్టం చేశారు.
అలాగే ముంబయి దాడుల సాకుతో భారత్, అమెరికాలు ఈ ప్రాంతంపై తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చూస్తున్నాయని.. ఎన్నికల నేపథ్యంలో పాక్‌పై ఆరోపణలు చేస్తూ భారత్‌లో హిందువుల ఆధిపత్య ప్రాంతాల్లో ఓట్లు దండుకొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని పేర్కొన్నట్లు తెలిసింది. పాక్ ప్రభుత్వ విధానాలు శత్రువులను క్షమాపణలు అభ్యర్థిస్తున్నట్లు ఉన్నాయని జమాతే తీర్మానంలో విమర్శించినట్లు విశ్వసనీయ సమాచారం.












Click it and Unblock the Notifications