చిరు పిట్టలదొర
హైదరాబాద్:'వందకే వంట సరుకు' అని చిరు పిట్టలదొర వాగ్ధానాలు చేస్తున్నారు. చిరంజీవి కుటుంబ సభ్యులకు సీఎం పదవి కావాల్సి వచ్చింది .ఆ ఆకాంక్షతోనే సేవ, సామాజిక న్యాయం అంటూ వల్లిస్తున్నారని పీసీసీ అధికార ప్రతినిధులు పాలడుగు వెంకట్రావు, ఎన్.తులసిరెడ్డి, కమలాకర్‌రావులు మంగళవారం ధ్వజమెత్తారు. అలాగే చిరంజీవి, పవన్‌కల్యాణ్, నాగబాబు, అల్లు అరవింద్ తదితరులు ఆర్థిక దొంగలు..వందల కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించారని పీసీసీ నేతలు ధ్వజమెత్తారు.రాజకీయం అంటే సినిమా కాద అని విమర్శించారు.
క్యాన్సర్‌తో బాధపడుతున్న నిజామాబాద్ జిల్లా మల్లారం గ్రామానికి నిరుపేద విజయ్‌కుమార్‌కు అవసరమైన రక్తాన్న తాము నిరుపేదలం ఉచితంగా ఇవ్వాలని కుటుంబ సభ్యులు ఎంత వేడుకున్నా వారి బ్లడ్ బ్యాంక్ నుంచి ఉచితంగా ఇవ్వలేదు.డబ్బులు వసూలు చేసారని ఆరోపించారు.అదే బాలునికి ముఖ్య మంత్రి రాజశేఖర్‌రెడ్డి సీఎం సహాయనిధి ద్వారా రూ.60 వేలు మంజూరు చేశారని తెలిపారు.












Click it and Unblock the Notifications