Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒంటరి పోరాటం చేస్తా :చిరు

Chiranjeevi
నెల్లూరు:ఎవరొచ్చినా, రాకున్నా ఒంటరిగా బరిలోకి దిగే సత్తా ప్రరాపాకు ఉంది.. అని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి స్పష్టంచేశారు. టీఆర్‌ఎస్‌తో పొత్తుకు తాము సిద్ధంగానే ఉన్నా... ఆ పార్టీ టీడీపీతో కలిసి పనిచేసేందుకు నిర్ణయించడంతో ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించినట్లు తేల్చి చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామన్నారు.

పార్టీలో కోవర్టులపై తమకు ఎటువంటి ఆందోళన లేదని చెప్పారు. చిరంజీవి దేశద్రోహి అన్న మంత్రి పొన్నాల వ్యాఖ్యలపై స్పందిస్తూ... ఎవరు దోశద్రోహులో ప్రజలు నిర్ణయిస్తారని, ఆయన తప్ప ఇంకెవరైనా తనను దేశద్రోహి అంటే అప్పుడు ఆలోచించాలని ఎద్దేవా చేశారు. పవన్‌ కల్యాణ్‌పై షబ్బీర్‌ అలీ తరహాలో మీరు కూడా పొన్నాలపై పరువు నష్టం దావా వేస్తారా? అని ప్రశ్నించగా తనకు సమయాన్ని వృథా చేసే అలవాటు లేదన్నారు. నెల్లూరు జిల్లాలో పీఆర్పీ అభ్యర్థుల విషయమై పూర్తిస్థాయి కసరత్తు జరగలేదని, దీనిపై త్వరలోనే విధాన ప్రకటన చేయనున్నట్లు చెప్పారు.

అవినీతిరహిత సమాజ స్థాపనే ప్రజారాజ్యం ధ్యేయమని, అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి నిర్దిష్ట ప్రక్రియ చేపడతామని తెలిపారు. ప్రభుత్వ పథకాలు పేదలకు అందేలా వివిధ దశల్లో ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. రాజకీయంగా హుందాతనాన్ని కాపాడే విషయంలో కట్టుబడి ఉంటామని, తాము ఎవర్నీ వ్యక్తిగతంగా విమర్శించడం లేదని, అధికార పార్టీ ప్రజావ్యతిరేక విధానాలనే తాము విమర్శిస్తున్నామని వివరించారు.రాష్ట్రస్థాయిలో ఒకే గుర్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని, ఈనెల పదో తేదీలోపు ఎన్నికల కమిషన్‌ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని, ఆ తర్వాత అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని చిరంజీవి వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+