హైదరాబాద్: రూ.5040 కోట్ల నగదు లోటును పూడ్చి చూపేందుకుగాను నికరనిల్వను పెంచి బ్యాలన్స్‌షీట్‌లో చూపినట్లు రామలింగరాజు సత్యం బోర్డుకు రాసిన ఓ లేఖలో తెలిపారు. ఈ విషయం మిగతా డైరక్టర్లకు ఎవరికీ తెలీదని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. అవకతవకలు, పొరపాట్లను సరిదిద్దేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదని రాజు ఈ లేఖలో వివరాలతో తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాను ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాననీ ఆయన అన్నారు. దాంతో సత్యం కంప్యూటర్స్ సంస్థకు చెందిన బ్యాలన్స్ షీట్లలో అవకతవకలు జరిగినట్లు ఛైర్మన్ రామలింగరాజు స్వయంగా అంగీకరించినట్లయింది.