'సత్యం'కు రామలింగరాజు రాజీనామా

Ramalinga Raju
హైదరాబాద్‌: హైదరాబాద్‌ సత్యం కంప్యూటర్స్‌ చైర్మన్‌ రామలింగరాజు తన పదవికి బుధవారం రాజీనామా చేశారు. జాతీయంగా, అంతర్జాతీయంగా సత్యం ఛైర్మన్‌ రామలింగరాజుపై వస్తున్న విమర్శలు, ఒత్తిళ్లకు ఆయన తలొగ్గారు. బోర్డు ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేసారు. కంపెనీ బ్యాలెన్స్‌షీట్‌ వివరాలను ఆయన బోర్డుకు సమర్పించారు. మరో డైరక్టర్‌ రామ్‌ మైనంపాటి తాత్కాలికంగా సీఈవో బాధ్యతలు స్వీకరించారు. సత్యం బ్యాలెన్స్‌ షీట్లలో అవకతవకలు ఉన్నట్లు ఆయన ఒప్పుకున్నారు. మార్కెట్‌లో సత్యం షేర్లు భారీగా పతనమయ్యాయి.

గడిచిన పదిహేను రోజుల కాలంలో సత్యం కంప్యూటర్స్‌లోని 3.64 శాతం వాటాకు సమానమైన 2.45 కోట్ల షేర్లను ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ట్రస్ట్‌ ఓపెన్‌ మార్కెట్లో విక్రయించింది. డిఎస్‌పి మెరిల్‌ లించ్‌, డిఎస్‌పి బ్లాక్‌ రాక్‌ , డాయిష్‌ బ్యాంక్‌, హెచ్‌డిఎఫ్‌సి మ్యూచువల్‌ ఫండ్‌ , ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసులకు ట్రస్టీగా ఉన్న ఈ సంస్థ ఈ షేర్లను అమ్మినట్లు సత్యం కంప్యూటర్స్‌ బిఎస్‌ఇకి మంగళ వారం నాడు తెలిపింది. డిబెంచర్‌ హోల్డర్లు, లెండర్స్‌ నుంచి రాత పూర్వక సూచనలను అందుకున్న తర్వాతనే తాకట్టు పెట్టిన షేర్లను విక్రయించినట్లు వెల్లడించింది.

తమ కంపెనీని విక్రయించనున్నట్లు వస్తున్న వార్తలను సత్యం కంప్యూటర్స్‌ తోసిపుచ్చింది. హెచ్‌సిఎల్‌ టెక్నాలజీ, టెక్‌ మహీంద్రా, కాగ్నిజెంట్‌ కంపెనీలు సత్యంను కొనుగోలు చేయటానికి ప్రయత్నిస్తున్నాయని వార్తలు వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమైనవని సత్యం కంప్యూటర్స్‌ ఖండించింది.. మీడియాలో వచ్చిన కధనాలపై హెచ్‌సిఎల్‌, కాగ్నిజె ంట్‌ ప్రతినిధులు మాట్లాడటానికి నిరాకరించగా , టెక్‌ మహీంద్రా ఈ నివేదికలు ఆధారాలు లేనివని తోసిపుచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+