హైదరాబాద్:పేదవారికి వినోదం లేకుండా చేసిన వ్యక్తి రూ.100కే సరుకులిస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సినిమా టికెట్ ధరను రూ.100కు పెంచేలా చేసిన చిరంజీవేనని తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజా ఉద్ఘాటించారు. తన లాభం కోసం సామాన్యుడు సినిమా చూడలేని విధంగా టికెట్ ధరను పెంచడానికి కారణమైన చిరంజీవి చౌకగా సరకులు ఇస్తానంటే నమ్మేవారెవరూ లేరని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.