సిద్దిపేట: విజయశాంతి స్ధాపించిన తల్లితెలంగాణా పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేసేందుకు ఆమె సూత్రప్రాయంగా అంగీకరించారని సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌రావు వెల్లడించారు.మీడియా సమవేశంలో ఈ విషయం ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ..తాము తల్లితెలంగాణా పార్టీతో చర్చలు జరుపుతున్న మాట వాస్తవమేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణా కోసం కట్టుబడి ఉండే పార్టీలన్నింటినీ ఒకతాటి మీదకు తీసుకువచ్చేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ మరోవైపు తెలంగాణా ప్రాంత మేధావులతోనూ చర్చలు జరుపుతున్నారని తెలిపారు. తెలంగాణా ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని అన్నారు. ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పడానికి తెలంగాణ వాదులంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని హరీష్‌రావు అన్నారు.