తెలుగునాట భోగి వెలుగులు
హైదరాబాద్: తెలుగువారికి అత్యంత ప్రాధాన్యం ఉన్న పండుగ సంక్రాంతి పండుగ. మూడు రోజులపాటు జరిగే ఈ పండుగలో మొదటిరోజైన భోగి పండుగను ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. నగరంలోను, జిల్లాల్లోను తెల్లవారుజామునుంచి భోగి జ్వాలలు మొదలయ్యాయి.
ఇళ్లముందరా, వీధి కూడళ్లలోను కలప, పిడకలతో భోగిమంటలు వేశారు. చలిని సైతం లెక్కచేయక పిల్లలు, పెద్దలు ఇందులో పాల్గొన్నారు. నగరాల్లో అపార్టుమెంటు వాసులు కూడా ఒకచోటచేరి ఈ వేడుకను నిర్వహించారు. పత్రీకలు, టీవీ చానళ్ళు ఈ పండుగకు ప్రాధాన్యమిచ్చాయి.












Click it and Unblock the Notifications