వైఎస్ డీల్స్ పై సోనియాకు డిఎస్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మంగళవారం ఉదయం సమావేశమయ్యారు. ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం, మేటాస్-సత్యం కుంభకోణంపై సోనియా గాంధీకి వివరించినట్టు తెలిసింది. ఈమధ్య వైఎస్ కు డిఎస్ ఏకు మేకుగా మారినట్టు కాంగ్రెస్ వర్గాల కథనం.
రాష్ట్రంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ అభివృద్ధి పథకాలను పొగుడుతూ ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను అక్రమాలను సోనియా గాంధీకి విన్నవించడం డిఎస్ వ్యవహార శైలి. అధిష్టానవర్గానికి డి.శ్రీనివాస్ వీర విధేయుడు. వైఎస్ మీద అయినా అధిష్టానవర్గానికి అనుమానాలు ఉండవచ్చు కానీ డిఎస్ మీద ఉండే అవకాశం లేదు.












Click it and Unblock the Notifications