రాష్ట్రపతికి వీడ్కోలు
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ దక్షిణభారతదేశంలో జరిపే శీతాకాల విడిది పూర్తయింది. దీనికోసం ఆమె బొల్లారంలో విడిది చేసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈరోజు ఉదయం ఆమె ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆమెకు హైదరాబాద్ విమానాశ్రయంలో సకల అధికార లాంచనాలతో వీడ్కోలు పలికారు.
హైదరాబాద్ లో విడిది చేసినంత కాలం ఆమె పండ్లు, పుల్కాలు, ఆకు కూరలు, పండ్ల రసాలను ఆహారంగా తీసుకున్నారు. ప్రతిరోజూ ఉదయం ఆమె పెసరపప్పు ఇడ్లీలను ఎంతో ఇష్టంగా తినేవారని బొలారం రాష్ట్రపతి నిలయం అధికారులు మీడీయాకు చెప్పారు.












Click it and Unblock the Notifications