సీరియస్ ఫ్రాడ్ ఆఫీసుకు 'సత్యం' కేసు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రధాని కార్యాలయంలో సత్యం వ్యవహారంపై ఈ రోజు జరుగుతున్న సమావేశానికి కేంద్ర మంత్రులు చిదంబరం, కమల్‌నాథ్, పీసీ గుప్తా హాజరయ్యారు. హైదరాబాద్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ సత్యంపై నివేదికను కేంద్ర కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించింది. ఈ కేసును కేంద్రమంత్రి గుప్తా సీరియస్ ఫ్రాడ్ ఆఫీసుకు దర్యాప్తుకు పంపించి మూడు నెలల్లో నివేదిక పంపించాలని ఆయన కోరారు.
రామ్ మైనంపాటి ఎక్కడ?
సత్యం క్లయింట్లను కలుసుకునేందుకు రామ్ మైనంపాటి అమెరికా వెళ్లినట్లు మంగళవారం సత్యం వర్గాలు తెలిపాయి. కొత్త బోర్డు సభ్యులతో ఆయన ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నట్లు బోర్డు తెలిపింది.












Click it and Unblock the Notifications